Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మాంసాహారంలో చేపలు మేటి, చేపలు మంచి పౌష్టికహారం, చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల ఉత్పత్తులుగా మార్పు చేసి విక్రయించడం ద్వారా యువతీ యువకులు స్వయంఉపాధి అవకాశాలు పొంద డంతో పాటు చేపల వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోర్స్ కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు.కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక యువతకు జాతీయ మత్య్స అభివద్ధి మండలి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సెంటర్‌ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్పబ్లిక్ సిస్టమ్ వారి ఆర్థికసహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా పెంచే చేపఉత్పత్తుల తయారీ, వినియోగంపై యువతీ యువకులకు నెల్లూరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.జస్వంతి, కేవీకే గడ్డిపల్లి గహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్.సుగంధి ప్రాక్టికల్‌గా అవగాహనా కల్పించారన్నారు. ప్రస్తుతం చేపల సాగు బాగా పెరిగి అందరికి అందుబాటులో ఉండి తినడానికి ఇష్టపడినా వాటి ముళ్లంటే భయపడే వారు కొందరు ఉన్నార న్నారు.చేపలను ఎన్నో విలువైన ఉత్పత్తులుగా తయారు చేసి అమ్ముకోవడం ద్వారా స్వయం ఉపాధిని పొంద వచ్చన్నారు. ఇతర మాంసాహారాల మాదిరిగా చేపల ద్వారా విలువైన ఉత్పత్తులైన చేపముక్కలు, చేప పిల్లేట్స్, చేపకైమా, చేప వడియాలు, మురుకులు, చేపబాల్స్, కట్లెట్స్,వేపుడు, పచ్చళ్ళు, బజ్జీలు మొదలగునవి స్థానిక అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చన్నారు.వీటిని తినడానికి బాగా ఇష్టపడుతారని తెలిపారు.ఈ శిక్షణలో భాగంగా యువతీ యువకులు చేపమాంసంతో తయారు చేసే వివిధ రకాల వంటకాలను తెలుసుకొని ప్రాక్టికల్ గా చేపల విలువధారిత వంటకాలను వండి నైపుణ్యం పొందారన్నారు.ఇలా తయారు చేసుకొన్నా చేప ఉత్పత్తులు నెలరోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చని, పిల్లలు, పెద్దలు ఇష్టంంగా తింటారన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ, సుప్రీత, పుష్ప, స్రవంతి, హైమావతి, భవాని, శైలజ, ప్రదీప్‌తో, రాంబాబు, నాగరాజు, గుర్వయ్య, మట్టయ్య, అంబేద్కర్, నరేష్, సాజిత్, సారథి, జానయ్య, విశ్వనాథం పాల్గొన్నారు.