Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కొండమల్లేపల్లి
క్రీడలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని దేవరకొండ మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు ఆడడంతో మానసిక ప్రశాంతతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, రైతుబంధు అధ్యక్షులు కె.లింగారెడ్డి, జెడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆదిరాల రాము పంగ మల్లయ్య, ఉప సర్పంచ్ ముక్కమల్ల రాజలింగం, మాజీ ఉపసర్పంచ్ ఎస్కే జాంగిర్, పంగ యాదయ్య, బచ్చన బోయిన శ్రీను, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ పంగ మల్లేష్, ఏ.విష్ణు , బొడ్డుపల్లి అశోక్, వెంకటేష్ పాల్గొన్నారు.