Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నేరేడుచర్ల
ఆక్వా రంగంలో శిక్షణ పొందుతున్న యువతకు చేప పిల్లల ఉత్పత్తి నర్సరీ యాజమాన్యంపై అవగాహనా కలిపించడానికి చేప పిల్లల హచేరీని సందర్శించినట్టు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త,అధిపతి బి. లవకుమార్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని సోమారం గ్రామానికి చెందిన కొమెర సురేష్ హరిణి ఫిష్ సీడ్ హచేరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపలకు ఓవాటైడ్ హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి గుడ్లు పెట్టించే విధానం, బ్రీడింగ్ ట్యాంక్, హాచింగ్ ట్యాంక్ , నర్సరీ చెరువుల నిర్వహించడం, చేప పిల్లల పట్టుబడి, ఆక్సిజన్ సహాయంతో ప్యాకింగ్ చేసి రవాణా చేయడం, చేపలకు వాడే వివిధ దాణా ల వాడకం, చేపల చెరువుల్లో వాడే వివిధ రసాయణాల గురించి ప్రాక్టికల్ గా యువతకు చూపించి అవగాహనా కలిపించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిష్ సీడ్ హచేరికి చెందిన రాజు, మనోజ్, రాము, హైమావతి, విమల, సుప్రీత భవాని, శైలజ, మట్టయ్య, నాగరాజు, శ్రీను, రాంబాబు, రాజకుమార్, జానయ్య, నరేష్, విశ్వనాధం,జానకిరాములు, మహేష్ ప్రదీప్ పాల్గొన్నారు.