Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
మండలంలోని గుడితండాగ్రామ పంచాయతీకి చెందిన గుగులోత్ నాగు ఇల్లు ఇటీవల విద్యుత్ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గాదరికిశోర్కుమార్ వారికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. శనివారం మండల కేంద్రంలో బాధితుడు నాగుకు టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లాడీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మెన్్ గోపగాని రమేష్ గౌడ్, కటకం వెంకటేశ్వర్లు ,ఎల్లబోయిన బిక్షం, పరమేష్, రవికుమార్, దుర్గయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.