Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డిపై దౌర్జన్యంతో దుర్భాషలాడి,దాడికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు వీరేంద్రను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ను దుర్భషలాడి,దౌర్జన్యానికి పాల్పడినందుకు నిరసనగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు తెల్లవారుజాము నుంచి విధులు బహిష్కరించి సీఐటీయూ జిల్లా కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్‌పై బీజేపీ నాయకుడి దౌర్జన్యం చేయడం, దుర్భాషలాడి, బూతులు తిట్టడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్‌ను బీజేపీ నాయకులు అడ్డుకొని నానా బూతులు తిడుతూ దుర్భాషలాడటం దుర్మార్గమన్నారు. జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు అహంకార పూరితంగా వ్యవహరిస్తు, దౌర్జన్యాలకు పాల్పడుతూ, అధికారులపైన, ప్రజల పైన దాడులకు పాల్పడడం సహేతుకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి సుందరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మధుసూదన్, కార్యదర్శి చాగంటి వెంకటరమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓగొటి దశరథ, సహాయ కార్యదర్శి బండారు మురళి, నాయకులు లక్కపాక శివ, ముదిగొండ ఎల్లమ్మ, కాసర్ల లింగయ్య, బాలెంల బాబు,బొజ్జ ఎల్లయ్య, వీరస్వామి, దేవరకొండ బిక్షం, చెన్నయ్య, పరశురాములు,లక్ష్మమ్మ, నాగమ్మ,నిర్మల,జానపాటి మంగమ్మ, జానపాటి యాదగిరి, బచ్చలి నరసన్న, రవి గట్టు పద్వి, జల్లి సాయి, యాదమ్మ, ఇరుగు వీరేందర్, కె నరేష్, శ్రీనివాస్, గట్టు నరేష్,నాగలక్ష్మి, వెంకటాద్రి, మాధవి, రేవతి, బిక్ష నాయక్, చంటి, సహదేవులు, వెంకన్న, సైదులు, పాండు,స్వప్న, నాగలక్ష్మి,సాల్మాన్, వెంకన్న,గిరి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.