Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నూతనకల్
మండల కేంద్రంలోని నాగార్జున ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో దేశసంస్కతీ,సాంప్రదాయాలను చాటిచెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు మారగాని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కతీ,సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మారగాని విజయలక్ష్మి, ఉపాధ్యాయులు గుర్రం యాదగిరి గౌడ్, ఇరుగు ఉపేందర్, సాయిరాం, వెంకటేశ్వర్లు,సందీప్, రాజేశ్వరి,ఉమా, జరీనా, రాధిక,సుష్మా సంధ్య,శ్వేత తదితరులు పాల్గొన్నారు.