Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.రాములు
నవతెలంగాణ-మునగాల
తెలంగాణ సాయుధ పోరాట యోధులు కొక్కిరేణి గ్రామ మాజీ సర్పంచ్ బహుదొడ్డి రామారావు ఆశయాలను సాధించాలని సీపీిఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. శనివారం కొక్కిరేణి గ్రామంలో రామారావు18వ వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నాటి నైజాం సర్కారుకు పో లీసులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చే శారు అదే సమయంలో ఆయన పై అ నేక కేసులు బనాయించినా మొక్క వో ని ధైర్యం తో ముందుకు సాగారని చెప్పారు. పార్టీ నిర్మాణంలో కమ్యూనిస్ట్టు ఉద్యమాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు . కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌ కగా అమ్మేస్తుందిని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న కాలంలో అమరవీరుల స్పూర్తితో ప్రజా ఉధ్యమాలకు సిద్ధం కా వాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు రామారావు విగ్రహానికి పలు వురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకట్ రెడ్డి ,మిట్టగణ్పుల ముత్యాలు, వట్టెపు సైదులు, పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, సీనియర్ నాయకులు పోటు పుల్లయ్య ,గ్రామ ఉప సర్పంచ్ రావులపెంట బ్రహ్మం, సైదులు, వెంకన్న ,లింగయ్య,సైదులు పాల్గొన్నారు.