Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అర్వపల్లి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ మామిడి పెద్ద పుల్లయ్య మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి బుర్ర శ్రీనివాస్ పులుసు సత్యం అన్నారు. మండల కేంద్రంలో పుల్లయ్య భౌతికకాయాన్ని శనివారం వారు సందర్శించి ఎర్ర జెండా కప్పి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్లయ్య అర్వపల్లి మండల పరిసర గ్రామాలలో లో అందరి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేశాడన్నారు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మండల వ్యాప్తంగా నిర్మించాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాసు ,కడియం కుమార్, కడెం లింగయ్య, పల్లా సుదర్శన,్ దేవరకొండ యాదగిరి ,చెరుకు యాక లక్ష్మి, సత్యం, శిఖ వెంకన్న, కొప్పోలు సరోజ, గడ్డం ఎల్లయ్య ,అబ్బులు పాల్గొన్నారు.