Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హుజూర్నగర్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు అయిన హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న చందా అప్పారావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఆచార్య ఔడీ నరసింహారావు పర్యవేక్షణలో అర్థ శాస్త్ర విభాగంలో నల్లగొండ జిల్లాలోని ఆర్థిక ద్వందాల గురించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రభావం అనే అంశం పైన ,సామాజిక ఆ పేదరిక ఆర్థిక అంశాలు పేదరికం వలసలు వ్యవసాయం నిర్మాణ రంగం శ్రామిక లభ్యత పేదరికం ప్రమాద బీమా, సామాజిక తనిఖీ జిల్లాలోని వివిధమండలాల్లో ఆర్థిక పరిస్థితుల పై చేసిన పరిశోధనలకు తనకు డాక్టరేట్ వచ్చిందని అప్పారావు తెలిపారు. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ,ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు డైసీ నరసింహారావు పురుషోత్తం లక్ష్మి సావిత్రి లకు అప్పారావు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఆయనకు డాక్టరేట్ లభించినందుకు కళాశాలలో పనిచేస్తున్న తోటిఅధ్యాపకులు మిత్రులు అభినందించారు.