Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నైజాం వారసులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆరోపించారు. శనివారం స్థానికంగా నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వనమా రాఘవ టీిఆర్ఎస్ ముసుగులో ఉన్న మగమని కుటుంబం చావుకు కారణమయ్యాడని ప్రభుత్వం వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు . కెేసీఆర్ పాలన నైజాము పాలనను తలపిస్తుందని చెప్పారు. నైజాము వారసులుగా తెలంగాణలోని ఎమ్మెల్యేలంతా ఎక్కడికక్కడ ప్రజలను పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏండ్ల క్రితం నైజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారని, ఇప్పుడు టీిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రజలు సమాయత్తమవుతున్నారని తెలిపారు. టీిఆర్ఎస్ నాయకులు దోపిడీదారులు హంతకులు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీిఆర్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. జరుగుతున్న ఘోరాలను కేసీఆర్ చూస్తూ చూడనట్టు ఉండటం వల్లనే ఎక్కడికక్కడ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయన్నారు.. పోలీసు వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని చెప్పారు. రాఘవ అరాచకాలకు లేదని ఇప్పటికే అతనిపైన ఉన్న అనేక కేసులలో దర్యాప్తు జరుగుతున్నా ఒక్కటి కూడా చార్జిషీట్ దాఖలు కాలేదన్నారు. కుటుంబమంతా బలికావడానికి కారణమైన వనమా రాఘవరావు పోలీసులు అరెస్ట్ చేయడం కాదు... ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి వెంటనే శిక్షపడేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పోరళ సతీష్ కుమార్, ఉట్కూరి సురేష్ ,నాయకులు పాల్గొన్నారు.