Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని స్పోర్ట్స్ భవనంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించిన స్పోర్ట్స్ అసోసియేషన్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, కృష్ణకిషోర్, బొడ్డుపల్లి కృష్ణ, సురేష్, వీవీఆర్, కుమార్ నాయక్, లక్ష్మీకాంత్, మహిళలు పాల్గొన్నారు.