Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరస్వామి గౌడ్
నవతెలంగాణ- సూర్యాపేట
ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతపై ప్రభుత్వం మానవతా దక్పథంతో పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, జై గౌడ ఉద్యమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇళ్లకు అవసరమైతే ప్రభుత్వం యజమానులకు కొంత జరిమానా విధించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. జరిమానాలు విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రజలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చడం వల్ల ప్రజలు కన్నీరు మున్నీరవుతు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే లే అవుట్లను,ఇళ్ల స్థలాలను క్రమ బద్ధీకరించాలని కోరారు.