Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
మండలంలోని కొలనుపాక , తూర్పు గూడెం గ్రామాల్లో సీఎంసహాయనిధి చెక్కులను మండల ఎంపీపీ గంధ మల్ల అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ శనివారం గ్రామపంచాయతీ ఆవరణంలో లబ్దిదారులకు పంపిణీచేశారు. పత్తి లక్ష్మి రూ.34 వేలు, ఆట అనిత రూ.13 వేలు ,ఆరుట్ల కొండల్‌రెడ్డి రూ. 44000 చెక్కులను అందజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,వంగాల శ్రీశైలం ,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు జంగా స్వామి, మాజీ ఎంపిటిసి మామిడాల అంజయ్య, వార్డు సభ్యులు తోడేటి నరేందర్ ,పుప్పాల మహేష్ ,బండి రాజు, సత్యనారాయణ, ఇంద్రసేన, తదితరులు పాల్గొన్నారు.