Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దొడ్డి కొమరయ్య భవన్లో అద్దంకి నరసింహ అధ్యక్షతన నల్లగొండ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14000 అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తే రూ.40 కోట్ల అద్దె భారం తగ్గుతుందని ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కొనసాగించి కేంద్రం పెంచిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెండింగ్ టీఏ, డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సెంటర్లకు పక్కా భవనాలను నిర్మించి ఇవ్వాలన్నారు. 2017 నుంచి టీ ఏ, డీఏలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ )నల్లగొండ ప్రాజెక్టు కమిటీ లీడర్లుగా మంజుల, విజయలక్ష్మి, జానమ్మ, రత్న, ప్రకృతాంబ, ప్రమీల, కళ్యాణి, మని రూప, టి.మంజులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య, అంగన్వాడీ టీచర్లు మంజుల, విజయలక్ష్మి, జానమ్మ, పర్వీన్ సుల్తానా, మణిరూప, మమత, చంద్రకాంత, శ్రీమతి, రత్న, సరిత, పద్మ , చంద్రకళ, రజిత, మల్లీశ్వరి, అనిత, శ్రీలక్ష్మి, నవనీత, రేణుక, హేమలత, రాజేశ్వరి, విమల, సునీత,యాదమ్మ, ప్రమీల పాల్గొన్నారు.