Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
భూ ఆక్రమణకు పాల్పడుతున్న రియల్టర్ల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజనులు, కాంగ్రెస్ నాయకులు శనివారం తహల్దార్కు గిరిజనులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు,కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మండలంలోని పోర్లగడ్డ తండాకు చెందిన అనేక మంది గిరిజనులకు సంబంధించిన పట్టా భూములు సర్వే నెంబర్ 263 నుండి మొదలుకొని 277 వరకు 180 ఎకరాలు భూమి ఉందన్నారు. ఇందులో కొంతమురు రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి,రామ్ కుమార్ కు అగ్రిమెంట్ చేసినట్లు తెలిపారు. అగ్రిమెంట్ ల ఆధారంగా రియల్టర్లు అదే సర్వే నెంబర్లో సాగుచేస్తున్న రైతులకు సంబంధించిన సాగు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు చేసిన రైతులకు మొత్తం డబ్బులు చెల్లించకుండా చెల్లని చెక్కులు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న ఆరోపించారు. తమ భూములను అదే సర్వే నెంబర్లు కలిగి ఉండటంతో అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తాసిల్దార్ కు వివరించారు.ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ముటేషన్ నిలిపివేయాలని కోరారు. సాగులో ఉన్న రైతులకు ఆన్లైన్ పట్టాలు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ నాయక్,కాంగ్రెస్ నాయకులు మందుల బాలకష్ణ,కరెంటు శ్రీను నాయక్,బొడ్డుపెళ్లి యాదయ్య,గిరిజన రైతులు వడిత్యా బద్య,నోకియా, ఉ దావత్ అంతిరామ్,హత్తి రామ్, తదితరులు ఉన్నారు.