Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిలభారత వ్యకాస జాతీయ కౌన్సిల్ ములకలపల్లి రాములు
నవతెలంగాణ- నేరేడుచర్ల
సూర్యాపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి నెలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు ,జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని అరి బండి లక్ష్మీనారాయణ భవన్లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలలో భూ సమస్య తీవ్రంగా ఉందన్నారు. 1994 నుండి 97 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం అభివద్ధి పేరుతో బలవంతంగా తీసుకుంటుందన్నారు. పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలలో ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్న రెవిన్యూ యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. సూర్యాపేట జిల్లాలో విచ్చలవిడిగా ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందన్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు అండదండలుగా ఉన్నాయని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి నెలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 30 రోజులపాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వి. పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమ గుండ్ల నగేష్ ,జిల్లా ఆఫీస్ బేరర్స్ పులుసు సత్యం, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పోషణ బోయిన హుస్సేన్, సోమ పంగ జానయ్య ,జిల్లా కమిటీ సభ్యులు సిరికొండ శ్రీను, పడమటింటి నగేష్, వెంకట ముత్యం, గుంజ వెంకటేశ్వర్లు, బి .సాంబయ్య, గుండు సైదులు ,అక్కినపల్లి మీనయ్య, యాకయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.