Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బ్యాంకు డిఫాల్టర్‌గా రైతులను మార్చొద్దు
అ యాసంగి వడ్లు కొన్నెంతవరకు రైతుల వెంటే
అ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య.
నవతెలంగాణ -రామన్నపేట
వరి వేస్తే ఉరే అని, సాగుకు రైతులను దూరం చేసి రైతు బంధు సంబురాలు నిర్వహించడం సిగ్గుచేటని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల సభ్యత నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని నియోజకవర్గంలో 50 వేల సభ్యత నమోదు చేయనున్నామన్నారు. డిజిటల్ సర్వే సభ్యత నమోదు లో రెండు లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని, ప్రతి కార్యకర్త దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2018 నుండి సాగు పెట్టుబడి నిస్తూ ఇప్పుడు కొత్తగా రైతు బంధు సంబరాలు నిర్వహించడం రైతులను మభ్య పెట్టడానికేనని విమర్శించారు. యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల వెంటే ఉండి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేసీిఆర్ 150 ఎకరాల వరి సాగు చేసి రైతులను వద్దనడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల లక్ష రూపాయల పంట రుణమాఫీ చెయ్యకుండా బ్యాంకులలో రైతులను డిఫాల్టర్ గా మారుస్తూ బ్యాంకుల నుండి రైతులను దూరం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు తీసుకున్న లక్ష రుణానికి లక్ష రూపాయల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నియంతత్వ పాలనకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆది మల్ల శంకరయ్య, జిల్లా కార్యదర్శి బోడ స్వామి, మాజీ ఎంపీటీసీ సాల్వే రు అశోక్, పట్టణ అధ్యక్షులు ఎండి జమీరో ద్దీన్, కన్వీనర్ విజరు కుమార్, వక్త్ బోర్డు మాజీ సభ్యులు ఎండి అజీమోద్దీన్, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి ఎజాస్, గురుకు శివ, మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాని, మహేశ్వరం అశోక్, మహ్మద్ జానీ, తదితరులు పాల్గొన్నారు.