Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి కాల్వల పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని ధర్మారెడ్డి పల్లి కాలువ పనులు, నీళ్లు లేకుండా ఉన్న చెరువును వారు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గుండ్రాంపల్లి సభకు వచ్చినప్పుడే ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి కాలువల పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 350 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదని తెలిపారు. వర్షాలు వచ్చి వివిధ గ్రామాల్లోని చెరువుల్లో నీళ్లు నిల్వ ఉన్నా, వనిపాకల చెరువులో మాత్రం తగినంత నీరు లేదని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కాలువల పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు కత్తుల లింగస్వామి, గుడిసె లక్ష్మీ నారాయణ, గ్రామ శాఖ కార్యదర్శి గునగంటి కృష్ణయ్య, చంద్రగిరి రవికుమార్ పాల్గొన్నారు.