Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్రంపోడు :దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జయంతిని ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జెల చెన్నారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల వెంకన్న యాదవ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దోటి చంద్రమౌళి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రావులపాటి భాస్కర్, యువజన విభాగం అధ్యక్షులు కుప్ప పృథ్వీరాజ్ గౌడ్, సర్పంచులు చాడ చక్రవర్తి, బాలమల్లయ్య, జ్యోతి లింగారెడ్డి, మండలి దీప రాములు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.