Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియొగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కోరారు. పట్టణంలోని నందిపహాడ్లో మన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆ ప్రాంతంలోని 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కార్పొరేట్ వైద్యం తక్కువ ధరకు అందించాలని కోరారు. తమ ఆసుపత్రిలో సేవలు పొందే వారికి రాయితీ ఇవ్వాలని సూచించారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఇఫ్తాకర్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో 20 శాతం రాయితీ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీి.విజరుకుమార్, మార్కెటింగ్ మేనేజర్ దైదా నాగరాజు, జనరల్ మేనేజర్ చంద్రకాంత్, సతీష్, సత్యనారాయణ, డీఎంఓ ప్రకాష్ పాల్గొన్నారు.