Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
మండలపరిధిలోని వజినేపల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హుజూర్నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి జల్లేపల్లి వెంకటేశ్వర్లు (జెవిఆర్) అన్నారు.ఆదివారం ఆయన ఈ విషయమై వజినేపల్లి గ్రామంలో స్థలపరిశీలన చేశారు.త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా బుగ్గ మాధారం సందర్శించి జెండా దిమ్మె కోసం స్థలాన్ని పరిశీలించారన్నారు.పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాదర్రెడ్డి దొండపాడు కార్యకర్తలను కలిసి పార్టీ బలోపేతం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్తండా గ్రామశాఖ అధ్యక్షుడు లావుడియా వెంకటేశ్వర్లు, వై.ఆనందరావు, రాజశేఖర్, కిరణ్, శరత్, అశోక్, పండు, సుందర్రావు, మనోహర్, ప్రసాద్, సునీల్, బాలసుందర్, ఏసుబాబు, ప్రవీణ్, అనిల్, మాధవరావు, గణేష్, వెంకటేష్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.