Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
కరోనా సమయంలో కూడా ప్రాణాలను లెక్కచేయకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులకు పీఆర్సీ కమిటీ సిఫారసు ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు అమలు చేయాలని జీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్స్, అంగన్వాడీ, వీఆర్ఏ, జీపీ కార్మికులు, పట్టణాల్లో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్కు కూడా పీఆర్సీ వర్తింపజేస్తూ ఇటీవల జీఓ విడుదలైందని, దాని ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అందరికీ జీతాలు పెంచి జీపీ కార్మికులకు మాత్రం ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులలో 90 శాతానికి పైగా దళితులు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారి పట్ల ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా జీతాలు పెంచుతూ సంక్రాం తి లోపు సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.