Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత యాజమాన్యంపై సరైన అవగాహన ఉన్నప్పుడే చేపల దిగుబడి బాగుంటుందని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్ అన్నారు.మండలపరిధిలోని.కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాల యువతకు జాతీయ మత్య్సఅభివద్ధి మండలి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారంతో, సెంటర్ ఫర్ ఇన్న్వ్ఱోషన్ ఇన్పబ్లిక్ సిస్టమ్, హైదరాబాద్ వారి సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా నీటి నాణ్యత, ప్లవకాల వద్ధి, చెరువుల సత్తువ చేయడానికి సేంద్రియ రసాయన ఎరువుల వినియోగం మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు.చేపలపెంపకంలో ఉష్ణోగ్రత, నీటిపారదర్శకత, నీటిరంగు, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, నీటి ఉదజని, క్షారస్వభావం,కఠినత్వం, కార్బన్‌డై ఆక్సైడ్, అమ్మోనియా, పాస్పరస్, హైడ్రోజెన్సల్ఫేడ్, నైట్రేట్ మొదలుగు వాటి మోతాదు ఎంత శాతం ఉంటే బాగుంటుందనే అంశాల గురించి ప్రాక్టికల్‌గా నీటి నాణ్యతపరిశీలన విధానాన్ని చేసి చూపించామన్నారు.కేవీకేలోని వర్మీ కంపోస్ట్ తయారీ, సేంద్రియ ఎరువలను చేపల చెరువుల్లో ప్లవకాల అభివద్ధికి వాడడం వలన కలిగే లాభాల గురించి ప్రాక్టికల్‌గా వివరించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి, సుప్రీత, పుష్ప, స్రవంతి, హైమావతి, విమల, శైలజ, శ్రీనివాస్ , మట్టయ్య, రాజకుమార్‌తో, నరేందర్పా, అంబేద్కర్, ప్రదీప్, సాజిత్ కుమార్, సారధి, నరేష్, సైదులు పాల్గొన్నారు.