Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రికి కతజ్ఞతలు తెలిపిన ముస్లిములు
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలకేంద్రానికి చెందిన ముస్లిం మైనారిటీల ఖబరస్థాన్ నిర్మాణానికి వారి కోరిక మేరకు మండలకేంద్రంలో ఎకరం ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం కేటాయించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లిముల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు.కోఆప్షన్ సభ్యులు షేక్ రఫీ మాట్లాడుతూ తమ ముస్లిముల ఏండ్ల నాటి కల మంత్రి సాకారమైందన్నారు.ఖబరస్థాన్ నిర్మాణంతో పాటు ప్రహరీ, బోరుబావిని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.ముస్లిముల తరపున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, ఎంపీటీసీ ఉరుకొండ జానకమ్మరాధాకష్ణ, ముస్లిం నాయకులు అమీర్‌సాబ్ సైదా,మొజం లతీఫ్,మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్,నాయకులు తూముల ఇంద్రసేనారావు, గోపి,రహమాన్, దాసరి శ్రీనివాసు కార్యకర్తలు పాల్గొన్నారు.