Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలపరిధిలోని ఆనంతారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మామిడి రేవతి పరందాములు మామ మామిడి సైదులు అనారోగ్యంతో అదేవిధంగా మండలకేంద్రానికి చెందిన యువకుడు మామిడి రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మతి చెందారు. కాగా ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మతుల గహాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించి కుటుంబసబ్యులను పరామర్శించారు.రాజు తల్లి తండ్రులు మామిడి వెంకన్న రజితను ఓదార్చి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.మధ్యలో ఆగిన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, సర్పంచ్ చెన్నూ శ్రీనివాసరెడ్డి, మండలఅధ్యక్షుడు దొంగరి యుగంధర్, కోఆప్షన్ సభ్యుడు షేక్ రఫీ, పెద్దగట్టు డైరెక్టర్ ఆవుల అంజయ్య, నాయకులు తూముల ఇంద్రసేనారావు, మామిడి అంజయ్య, మామిడి పరందాములు, రాధాకష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.