Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
సిండికేట్ రాజకీయానికి నేరేడుచర్ల పట్టణం అడ్డాగా మారిందని, పట్టణ అభివద్ధికి సిండికేట్ రాజకీయం పనికి రాదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు.రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా నేరేడుచర్ల గ్రంథాలయ శాఖ వారు నిర్వహించిన ముగ్గుల పోటీలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేరేడుచర్లకు గతంలోమంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు సైతం నేరేడుచర్ల సిండికేట్ రాజకీయం గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు.పట్టణాభివద్ధిలో పోటీ పడాలే తప్ప అభివద్ధిని అడ్డుకోవద్దని చెప్పారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివద్ధికి రూ.15 కోట్లు నిధులు విడుదల అయ్యాయని, కోర్టులో కేసులు వేసి నిధులు రాకుండా అభివద్ధి అడ్డుకున్నారని మండిపడ్డారు.ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఒక కారుకు 82 వేల మందికి రైతుబంధు వలన లబ్ధి చేకూరుతుందని చెప్పారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్టు తెలిపారు. గ్రంథాలయ అభి వద్ధికి ఎమ్మెల్యే నిధి నుండి రూ.10 లక్షలు శాంక్షన్ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మహిళలకు మంచి అవగాహన ఉందని మహిళలు వేసిన ముగ్గులు చూస్తే తెలిసిపోతుంది అని ఆకర్షణీయమైన ముగ్గులు వేసిన మహిళామణులకు అభినందనలు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలలో పలుగొన్న మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇంజమూరి యశోదరాములు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంథాలయచైర్మెన్ గుర్రం మార్కండేయ, వైస్‌ఎంపీపీ తాళ్లూరు లక్ష్మీనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, చిల్లపల్లి సొసైటీ చైర్మెన్ అనంతు శ్రీనివాస్‌గౌడ్, నాగండ్ల వెంకటేశ్వరావు, పచ్వా వెంగల్రావు, బుదిగే చంద్రయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.