Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ : ఇటీవల తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు జాడి రాజును మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల డాక్టర్‌గా, సామాజికవేత్తగా నియోజక వర్గ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించినట్లు చెప్పారు. రాజుకు పదవి ఇచ్చిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రంలో అంబేద్కర్ దేవాలయ సాధన సమితి అధ్యక్షులు పుట్టల దినేష్, వీరస్వామి పాల్గొన్నారు.