Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మలవీరారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
ఆశా కార్యకర్తలకు కోవిడ్ 19 రిస్కు అలవెన్సులు పెంచాలని, 16 నెలల పెండింగ్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. దామరచర్ల సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆశా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పదివేల రూపాయలను అమలు చేస్తూ పీఆర్సీ ప్రకారంగా రూ. 12,500 చెల్లించి, కనీస వేతనంగా రూ.26 వేలను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కోవిడ్ కాలంలో 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించినా అమలుచ చేయలేదన్నారు. 2020 ఏప్రిల్ నుంచి నేటి వరకు 19 నెలల్లో పెండింగ్ రిస్కు అలవెన్సులు ఒక్కొక్కరికి పంతొమ్మిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు కేవలం మూడు వేల రూపాయలు చెల్లించి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. నవంబర్ 25న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు డిసెంబర్ 1 నుంచి పెంచిన పీఆర్సీ డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పి నేడు పాత పారితోషకాలు చెల్లిస్తామని చెప్పడం సరికాదన్నారు.