Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
రైతుబంధు వారోత్సవాల్లోభాగంగా ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మండలంలోని వెంకిర్యాల గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు.స్వతహాగా ట్రాక్టర్ నడుపుతూ పల్లెగూడెం, రుద్రవెల్లి, రాఘవపురం, చిన్నరావులపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలమీదుగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి మండలకేంద్రంలోని పోచంపల్లి కూడలి వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ఈ నెల 10 నాటికి రైతుబంధు పథకం ద్వారా అన్నదాతల ఖాతాల్లోకి 50వేల కోట్ల రూపాయలు జమకానున్నాయని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో పల్లెలు ఆర్థిక పరిపుష్టి సాధించాయన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జెడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాచమల్ల శ్రీనివాస్, చింతల సుదర్శన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.