Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో భాగంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సభ్యత్వం తీసుకొని సభ్యత్వ రుసుము కూడా చెల్లించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ,కార్యకర్తలు అధైర్యపడొద్దని, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు.త్వరలో నియోజకవర్గ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రివ్యూ మీటింగ్ జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు గుడిపాటి నర్సయ్య, కాంగ్రెస్ తుంగతుర్తి మండలఅధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పెండెం రామ్మూర్తి, యువజన, కాంగ్రెస్ నాయకులు ఉప్పుల రాంబాబు, ఎల్లబోయిన శ్రీకాంత్, తుంగతుర్తి నియోజకవర్గ ఎన్ఎస్యూఐ ఇన్చార్జి కొండరాజు, యాకయ్య, ఎండి అబ్దుల్, పప్పుల హరీష్, ఎస్కె.హసేన్, అక్కినపల్లి నరేష్, కొండ అజరు, నారాయణదాసు వెంకన్న, గుడిపాటి మహేందర్, ఆశిక్ ఇలాయి, వంశీ ,సిద్దిక్ పాల్గొన్నారు.