Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్ఎం
ప్రతి రైతుకు రైతుబంధు పథకం అందిస్తూ, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ఆమెపూలమాలలేసి ఘనంగానివాళులర్పించారు.రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను పరిశీలించారు. అనంతరంఏర్పాటుచేసినసమావేశంలోఆమెమాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలను పభుత్వం అందిస్తుందన్నారు.. రహిఖాన్పేట క్లస్టర్ పరిధిలోని3028 మంది రైతులకు 10 కోట్ల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. క్లస్టర్ పరిధిలోని అకాలంగా 12 మంది రైతులు మరణించగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున కుటుంబసభ్యులకు అందాయన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు.అభివద్ధి విషయంలో పోతిరెడ్డిపల్లిగ్రామానికిఅన్నివిధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముగ్గులపోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన వారికి నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈసందర్భంగా గ్రామంలోని రైతులను ఆమె శాలువా కప్పి ఘనంగా సన్మానిం చారు.ప్రతిఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించి, శానిటైజర్ చేసుకోవాల న్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గనగాని మాధవి మల్లేశంగౌడ్ రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, ఉపసర్పంచ్ ఎర్ర శోభావెంకటరెడ్డి, ఏఓ శిల్ప, ఏఈఓ సంపూర్ణ ,టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు బీసుచందర్గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లగ్గాని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్,నాయకులు కోరే భిక్షపతి, భాషబోయిన ఉప్పలయ్య, పంజాల వెంకన్న, సోలిపురం అరుణ, మల్లారెడ్డి, కాలే మల్లేష్, భిక్షం, రంగారెడ్డి పాల్గొన్నారు.