Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
ఫిబ్రవరి 1,2వ తేదీలలో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తత స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆయన కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని ప్రయివేట్ పరం చేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అనేకచట్టాలను మారుస్తూ ఆర్డినెన్స్‌లను రూపొందిస్తుందన్నారు.అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉపాధిహామీ చట్టంలో పనిచేస్తున్న కార్మికులకు వారం వారం బిల్లులు చెల్లించలేక,నానా ఇబ్బందులు పెడుతూ చట్టం మీద వ్యతిరేకత తీసుకొచ్చి కార్మికులు పనులకు రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు.ఈ కుట్రలకు వ్యతిరేకంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్ట పరిరక్షణను కోసం, పెండింగ్ బిల్లుల విడుదల కోసం, సంవత్సరానికి 200 రోజుల పనిదినాల కోసం, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని గ్రామీణ ఉపాధి కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.భారత దేశంలో గోదాముల్లో లక్షలాది టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నా అనేకమంది పేదలు ఆకలితో అలమటిస్తు ఆకలిచావులు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు.ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆహార నిల్వలను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.యాదగిరిగుట్ట నిర్వహిస్తున్న సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి నుండి మే మాసం వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే భూ పోరాటాలు, కూలీ పోరాటాల గురించి,కూలీ వాడల అభివద్ధి గురించి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు గురించి ఈ సమావేశాల్లో చర్చించి కర్తవ్యాలను రూపొందిస్తామని ఈ విస్తతస్థాయి సమావేశాలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, జాతీయ కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు గార్లు పాల్గొంటున్నారన్నారు.ఈ సమావేశాల జయ ప్రధానికి అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నరసింహులు,సిఐటియు మండల కన్వీనర్ బబ్బురి పోశెట్టి, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే.లతీప్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాపోతు నర్సింహ,ఎస్కె.షరీఫ్, నల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.