Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎన్నికల అనంతరం వస్త్రాలపై జీఎస్పీ పెంపుముప్పు పొంచి ఉంది
అ వస్త్రాలపై జీరో జీఎస్టీ కోసం నిరంతరం ఉద్యమించాలి
అ పద్మశాలి సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు తిరందాసు ధనుంజయ
నవతెలంగాణ-రామన్నపేట
వస్త్రాలపై, ముడి వస్తువులపై 12శాతం జీఎస్టీ పెంపు సమసిపోలేదు.పెంపు ముప్పు పొంచే ఉందని, దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల దష్ట్యా జిఎస్టి పెంపు వాయిదా పడిందని, తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారని పద్మశాలి సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు తిరందాసు ధనుంజయ, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపోలు వీరమోహన్ అన్నారు.ఆదివారం మండలకేంద్రంలోని ఒక ఫంక్షన్హాల్లో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పడిన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ కార్యవర్గం యొక్క దిశానిర్దేశంతో పాటు పరిచయం, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు నియమ నిబంధనలతో పాటు వివిధ కార్యక్రమాలపై కార్యవర్గానికి అవగాహన కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ చేనేత వస్త్రాలపై, ముడి వస్తువులపై జీరో జీఎస్టీ కోసం ఐక్యంగా నిరంతర ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.చిన్నచిన్న విభేదాలను విడనాడి, పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ కులసంక్షేమం కోసం కషి చేయాలన్నారు.సమిష్టి ఉద్యమాలతోనే కుల సంక్షేమం ఏర్పడుతుందని, చట్టసభల్లో తగినంత ప్రాతినిధ్యం గౌరవం లభిస్తుందని వారన్నారు. వ్యవసాయం తర్వాత అత్యంత ముఖ్యమైన వత్తి చేనేత అని, లక్షలాది కుటుంబాలు ఈ వత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వాలు గుర్తెరిగి వత్తి మనుగడకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సంక్షేమ పథకాలు మినహా అన్ని కుల ప్రాతిపదికన సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారని వారన్నారు. ముక్తకంఠంతో మన సంక్షేమం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం నూతన కార్యవర్గానికి ఎన్నిక (నియామక) ధవ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి రాపోలు గణేష్, మండల పద్మశాలి సంఘం మండల గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్, తౌటం భిక్షపతి, ప్రధాన కార్యదర్శి పున్న రమేష్, ఉపాధ్యక్షులు మిర్యాల భాస్కర్, సంగిశెట్టి బాబు, రావేటి సతీష్, కోశాధికారి రవ్వ పాండు, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి రాపోలు శివరంజని, టెలి కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు జేల్లా వెంకటేశం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు రచ్చ యాదగిరి, వనం విఠల్, పున్న వెంకటేశం, సూరపల్లి యాదగిరి, కైరం కొండ సుదర్శన్, చలమల ధనుంజరు, రాపోలు రమేష్, ముశం నాగభూషణం, పాపని నరసింహ, కర్నాటి రమేష్, రవ్వ నరసింహ, సుంకి లక్ష్మీపతి, పెండెం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.