Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-మోటకొండూరు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలకేంద్రంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఎడ్లబండి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. దేశంలో ఇరవైతొమ్మిది రాష్టాలు ఉండగా ఎక్కడలేని ఈ రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు.పంటకు రూ.5 వేల చొప్పున ఎకరానికి రూ.10వేల మొత్తం 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమచేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు.అంతేకాకుండా రైతు అనుకోని యడల మరణిస్తే రైతు భీమా పథకం కింద రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చనిపోయిన కుటుంబానికి ఒక అన్నగా అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.అలాగే మిషన్ కాకతీయ పధకం కింద ఈ ఆలేరు నియోజక వర్గంలో మొత్తం గ్రామాల్లో మోటకొండూరుతో పాటు అన్ని గ్రామాల చెరువులను నీటితో నింపారన్నారు.ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రములో రైతుల కోసం కేసీఆర్ చాలా చేశారన్నారు. ఈ పధకం ద్వారా మండలములోని మొత్తం అర్హత పొందిన రైతులు 10,582 వీరికి మొత్తం పండించిన పంటకు గాను ఎనిమిది సీజన్లకుగాను రూపాయలు 986,76,3337 ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతు ఖాతాలోజమ చేశారన్నారు.సీఎంకేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ,వైస్‌ఎంపీపీ, రైతు సమన్వయ సమితి భూమండ్ల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మెన్ ఎగ్గిడి బాలయ్య, డైరెక్టర్లు, మండల కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు బోట్ల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు బైరోజు వెంకటాచారి, టీఆర్ఎస్ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ సునీల్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సుజాత, మహిళా సంఘం సభ్యులు, వడ్డెబోయిన శ్రీలత సర్పంచుల, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు,యువజన విభాగం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.