Authorization
Wed April 23, 2025 04:03:38 pm
అ సర్పంచ్ పాశం అలివేలమ్మ గోపాల్‌రెడ్డి
గుర్రంపోడు: గ్రామాభివద్ధికి గ్రామపంచాయతీలోని ప్రజలందరూ సహకరించాలని పాశంవారిగూడెం సర్పంచ్ పాశం అలివేలమ్మ గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి గ్రామపంచాయతీ లోని విద్యుత్ స్తంభాలు వైరు మార్పిడి గురించి, వైకుంఠధామం వరకు రోడ్డు వెంట ఉన్న చెట్లను ఉపాధి హామీ చట్టంలో తొలగించిన విషయం గురించి వార్డు సభ్యుల సమక్షంలో తీర్మానాలు చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవనీత, వార్డు సభ్యులు లక్ష్మణాచారి,నేతాళ్ళ. ఇద్దమ్మ, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.