Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాకలక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నాంపల్లి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక ఆ సంఘం మండల కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్య్రానికి ముందు ఆ తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు గా మార్చి కార్మికులను గొడ్డు చాకిరీ చేసే బానిసలుగా మార్చారన్నారు.ఈ చట్టాలు మార్చడం వల్ల సంఘం పెట్టుకునే హక్కు, ఎనిమిది గంటల పని విధానం, సమ్మె చేసే హక్కు గాల్లో కలిసి పోయాయన్నారు.75 సంవత్స రాలుగా దేశ ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగసంస్థలను కారుచౌకగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్నం టుతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుం దన్నారు.ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, గ్రామ పంచాయతీ కార్మికులు గాదెపాక మరియమ్మ, ఎదుళ్ళ పార్వతమ్మ, బిక్షమయ్య, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.