Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం అన్నెపాకపెద్ద కాశయ్య, అన్నెపాకబజార్ల ఇండ్లలో షాట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లు, నగదు కాలిపోయి ఆస్తి నష్టం జరిగి కట్టుబట్టలతో మిగిలిన విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ బాధిత కుటుంబాలను ఫోన్లో సోమవారం పరామర్శించారు. ఆయా కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయాన్ని తన మిత్రుల ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కోరె యాదయ్య, కోట రఘునందన్, సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్, రాములు, దండిగ నర్సింహ, నాయకులు రాములుగౌడ్, మాద లచ్చయ్య, బుడిగపాక గోవర్ధన్, కందికట్టే వెంకటేష్, అన్నేపాక హరీష్, కోత్తగోళ్ళ కోండల్, ఆకులపల్లి విజరు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.