Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఆరు కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన నెమ్మదిస్తాయి పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో సోమవారం చోటుచేసుకుంది.టౌన్ సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఖమ్మంక్రాస్రోడ్లో టౌన్ ఎస్ఐ రాంబాబు క్రాంతికుమార్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అదే సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడ వైపు నుండి వస్తున్న బస్సు దిగి బ్యాగులతో అనుమానాస్పదంగా బస్టాండ్ వైపుకు నడుస్తూ వెళ్తుండగా అనుమానంతో వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద బ్యాగులలో (6) కిలోల నిషేదిత గంజాయి లభించింది.వారిని అదుపులోకి తీసుకొని విచారించగా రుద్రవరం గ్రామం, కష్ణ జిల్లా రావుల వరప్రసాద్‌రావు, అరకు మండలం విశాఖపట్నం జిల్లా మజ్జిరాంబాబు, అరకు మండలం, విశాఖపట్నం జిల్లా కిల్లో కామేష్‌గా తెలిపారు.ముగ్గురు కలిసి గుర్తు తెలియని వ్యక్తుల నుండి వైజాగ్ నందు గంజాయిని కిలో ఒక్కింటికి రూ. 2వేల చొప్పున కొనుగోలు చేసి వాటిని 50 గ్రాముల చొప్పున పాకెట్లుగా మార్చి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తులకు 50 గ్రాముల ప్యాకెట్‌ను రూ.1000 అమ్మి లాభ పడుతున్నారు.09.01.2022న వైజాగ్ నందు ముగ్గురు నిందితులు కలిసి (6) కిలోల గంజాయిని కొనుగోలు చేసి దాన్ని 50 గ్రాముల పాకెట్లుగా మార్చుకొని హైద్రాబాద్‌లోని కూకట్ పల్లి నందు అమ్ముదామనుకుని ముగ్గురు బస్సులో వస్తుండగా కోదాడలోని ఖమ్మం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసు వారి వాహనాల తనిఖీకి భయపడి బస్సు దిగి నడిచి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.వారి నుండి 6 కిలోల గంజాయి, 3 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసు కున్నారు.గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.20 లక్షలుగా ఉంటుంది.గంజాయి అక్రమ రవాణాదారులను పట్టుకున్న కోదాడ పట్టణ ఎస్ఐలు రాంబాబు, క్రాంతికుమార్, సిబ్బంది యాకుబ్, కొండల్లను ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నర్సింహారావు పాల్గొన్నారు.