Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మూడేండ్లకింద రైతుబంధు పథకం ప్రవేశపెట్టి సోమవారం నాటికి పెట్టుబడి సాయం కింద రైతులకు 50 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన సందర్భంగా మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుబంధు సమతి మండలకన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం చేయడం కోసం, పెట్టుబడి సాయం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకం రైతు బంధు పథకం అన్నారు.ఒక పథకంతో లక్షల మంది రైతులకు కోట్లాది రూపాయలు అందించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే చరిత్ర సష్టించి భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.దేశ ప్రధాని సైతం తెలంగాణ రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తోందన్నారు దేశానికి అన్నం పెట్టే రైతుకు కష్టం రాకూడదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆయన స్వతహాగా రైతు కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి గా వ్యవసాయ రంగం అభివద్ధి దిశగా దష్టి సారించి రైతులకు యంత్రలక్ష్మి పథకంతో డాక్టర్లు వ్యవసాయ పనిముట్లను రాయితీతో అందిస్తుందన్నారు.ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో రైతులకు, వ్యవసాయరంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండేది కాదన్నారు.వర్షాకాలం రాగానే రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం తమ భార్యలపై ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేవారని, పెట్టుబడి దారుల వద్దకు వెళ్లి అప్పులు తీసుకుని అప్పుల పాలు అయ్యేవారన్నారు.ఇలాంటి సమస్యలు రాకుండా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున అందజేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, జిల్లా నాయకులు ఇట్టం వెంకట్రెడ్డి, ఎంపీటీసీ బెక్కం రమేష్, మాల్ మార్కెట్డైరెక్టర్లు కడారి శ్రీశైలం, నడింపల్లి యాదయ్య, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి పోగుల వెంకట్రెడ్డి, అందుగుల యాదయ్య, రేవల్లి సుధాకర్, కలకొండ దుర్గయ్య, కొన్రెడ్డి.ఏడుకొండలు, నాంపల్లి.సత్తయ్య, కామిశెట్టి పాండు, గౌరుకిరణ్, బెల్లి సత్తయ్య, గంజి సంజీవ, కర్నె యాదయ్య, సంగం గణేష్, బొట్టు జగన్ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.