Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని గౌడసంఘం యువజన జిల్లా అధ్యక్షులు శనగాని రాంబాబుఅన్నారు.పరిసర ప్రాంతమైన కేటీఅన్నారం గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి నెలవారం వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ప్రతిఏడాది లాగే కంఠమహేశ్వర స్వామి ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషదాయకం అన్నారు.స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన గౌడ కులస్తులకు కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమిరెడ్డి, వార్డు ప్రజలు, గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు.