Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
రైతులను సంతోషపెట్టడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని ఎంపీపీ ధరావత్కుమారిబాబునాయక్ అన్నారు.రైతుబంధు వార్షికోత్సవాలు సోమవారం మండలకేంద్రంలోని రైతువేదికలో రైతుబంధు వారో త్సవాలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రైతుబంధు కేసీఆర్‌కే సాధ్యమని, రైతుబంధు రూ. 50 వేల కోట్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు.సంక్షేమపథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి, ఏవో ఆశాకుమారి, సర్పంచులు బికారు, బద్రు, భూకా నాగునాయక్, మండల కో ఆర్డినేటర్ భూక్యా వెంకటేశ్వర్లు,ధరావత్ బాబునాయక్, ఏఈఓ ఇందిరా, రైతులు పాల్గొన్నారు.