Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
రాష్ట్రంలో మంచి నీటి చేపల పెంపకానికి విస్తృతఅవకాశాలు ఉన్నాయని, గ్రామీణ యువత చేపల పెంపకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఎంపీడీఓ వనజ అన్నారు. కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాల యువతకు జాతీయ మత్స్య అభివద్ధి మండలి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారంతో, సెంటర్ ఫర్ ఇన్న్వ్ఱోషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్, హైదరాబాద్ వారి సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు.మన జిల్లాలో అనువైన నీటివనరులు సమద్ధిగా ఉన్నాయన్నారు.నూతన సాంకేతికపద్ధతులను పాటించి యువత మత్స్య రంగంలో అభివద్ధి సాధించవచ్చన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇన్చార్జి బి.లవకుమార్ మాట్లాడారు.షెడ్యూల్డ్ కులాల వారికి ఉపాధిహామీచట్టం ద్వారా చెరువులు నిర్మించడానికి తోడ్పాటును అందిస్తు న్నామన్నారు.15 రోజుల పాటు శిక్షణలో మత్స్య సాగు, మార్కెటింగ్ తదితర అంశాలలో ప్రాక్టికల్ ద్వారా నిపుణుల బందంతో యువత అవ గాహనా కలిపించామని తెలిపారు. కేవీకే ద్వారా యువతకు వత్తి నైపుణ్య శిక్షణను వివిధ విభాగాలలో దీర్ఘ కాలిక శిక్షణ ఇచ్చి తోడ్పాడు తున్నామని, చేపలపెంపకానికి ప్రాధాన్యత ఎక్కువైందని కేవీకే సెక్రెటరీ గంటా సత్యనారా యణరెడ్డి అన్నారు.జిల్లావ్యాప్తంగా చేపల పెంపకం చేస్తున్న మత్స్య రైతులు చేప పిల్లల ఎంపిక , చెరువుల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రైతు సంఘంజిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీ రాములు తెలిపారు.స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా గడ్డిపల్లి బ్రాంచి మేనేజర్ బాపూజీ మాట్లాడుతూ శిక్షణ పొందిన అభ్యర్డులు నేరుగా తమ బ్యాంకునుసంప్రదించిన్నట్టయితే రుణ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, కిరణ్ , నరేష్, . సుగంది, డి.ఆదర్శ్, శిక్షణ పొందుతున్న యువత, సుప్రీత, లక్ష్మి, పుష్ప, హైమావతి,భవాని, శైలజ, విమల, రాంబాయి, స్రవంతి శ్రీను, రాజకుమార్ మట్టయ్య, అంబేద్కర్, నరేష్, విశ్వనాధం, జానయ్య, రాంబాబు, సైదులు, జానకిరాములు పాల్గొన్నారు.