Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కపాకర్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మెన్ నూకల వెంకటరెడ్డి కోరారు.నేడు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్, కోవిడ్ వ్యాధి మరల విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న టీకాలను అందరూ తప్పని సరిగా వేసుకుని కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందాలని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యానగర్ నందు బేబీమూన్ స్కూల్లో 15 నుండి 18 ఏండ్ల వయస్సు గల బాల,బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరికపాకర్ , బజ్జూరి శ్రీనివాస్, తేరట్పల్లి సతీష్, వెంపటి శభరినాధ్, వుల్లి రామాచారి, కట్కూరి వెంకటరెడ్డి, బొమ్మడి కష్ణ, మిర్యాలశివ, డాక్టర్ శ్రీకాంత్, ఎండి ఇస్మాయిల్ పాల్గొన్నారు.