Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు
నవతెలంగాణ-తుంగతుర్తి
క్రీడలు ఐక్యమత్యం, శారీరక దారుఢ్యం, మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని జెడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్‌రావు అన్నారు.సోమవారం మండల పరిధిలోని మినీస్టేడియంలో సంక్రా ంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్పోటీలను ప్రారంభించి మాట్లాడారు.యువత అన్ని రంగాల్లో రాణించి ముందంజలో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యుగం ధర్‌రావు, టీిఆర్ఎస్వీ నాయకులు శోభన్‌బాబు, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్ ,గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్‌గౌడ్,ఎల్లబోయిన భిక్షం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచులు నల్లు రాంచంద్రారెడ్డి,గుగులోత్ ఈరోజి, మామిడి వెంకన్న, మిరియాల అనిత జనార్ధన్,గుగులోత్ వెంకన్న, చందావెంకన్న, ఎంపీటీసీలు లతా విజరు కుమార్‌రెడ్డి, మట్టపల్లి కవితాకుమార్ పాల్గొన్నారు.