Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
చింతలపాలెం గ్రామంలో అభివద్ధి పనులు చేయాలని అంజనీ సిమెంట్ పరిశ్రమ ఎదుట చింతలపాలెం సర్పంచ్ షేక్ అయేషా అమీర్ సాహెబ్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యానికి ఈ క్రింది అభివద్ధి పనులు చేయాలని కోరారు.గ్రామంలో ప్రతిఏడాది కిలోమీటర్ సీసీరోడ్లు నిర్మించాలని, ఏడాదికి 10 ఉద్యోగాలు ఇవ్వాలని, సీఎస్ఆర్ ఆక్టీవీటి వివరాలు ప్రతినెలా తెలపాలని, గ్రామం నుండి మిషనరీ వాహనాలకు కాంట్రాక్టు ఇవ్వాలని, సీత మెమోరియల్ పాఠశాలలో గ్రామంలో అర్హులైన ఉపాధ్యాయులను తీసుకోవాలని, వాహనాలకు సంబంధించిన డ్రైవర్లను గ్రామం నుండి తీసుకోవాలని, బయట ఫార్మా కంపెనీ నుండి తీసుకొనే మెటీరియల్ సర్పంచ్ నుండి తీసుకోవాలని, గ్రామానికి చెందిన ప్రజలకు సిమెంట్ 50 శాతం రాయితీతో సిమెంట్ కట్టలుఇవ్వాలని కోరారు. క్వారీ నీటిని వేరే మార్గం నుండి మళ్లించాలి, గతంలో మాజీ సర్పంచులకు సహాయ సహకారాలు అందించారో దైవసాక్షిగా ఇవ్వాలని, గ్రామంలో ఎంబీబీఎస్ డాక్టర్తో ఉచిత వైద్య హాస్పిటల్ నిర్మిచాలని, క్వారీ మార్గంలో ఇరువైపులా మొక్కలు నాటాలి, రోడ్డుపై దుమ్ము రాకుండా రోజుకి నాలుగు సార్లు నీళ్లు చల్లించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం పాఠశాలలో ఉచిత విద్య అందించాలని, లేబర్ కాంట్రాక్టు గ్రామానికి చెందిన వారికి ఇవ్వాలని, మినరల్ ఫండ్ రిషిప్ట్ కాపీలు గ్రామ పంచాయతీకి అందించాలని, లైమ్ స్టోన్ రవాణా చార్జీలు పెంచాలని, మైనింగ్ చేయుటకు తీసుకున్న భూములు బదులు వేరే చోట భూములు, పరిహారం ఇవ్వాలని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఫైరింజన్, అంబులెన్స్ సౌకర్యాలు కల్పించాలని, ఇతర కంపెనీలు ఏ విదంగా గ్రామాలకు సహాయ సహకారాలు అందిస్తున్నాయో అదేవిధంగా గ్రామానికి కూడా సహాయ సహకారాలు అందించాలని వినతిపత్రం అందజేసి, పరిశ్రమ ఎదుట ధర్నా చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త షేక్ అమీర్సాహెబ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.