Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15 తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్యా సంజీవ్‌నాయక్ ఆదేశానుసారం సోమవారం మండలకేంద్రంలో సేవలాల్ సేన మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సేవలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్యా నాగునాయక్, మండల ప్రధానకార్యదర్శి బానోత్ ఖాశీంనాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 15 తేదీని రాష్ట్ర ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని కోరారు.500 జనాభా తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్‌రెడ్డికి గిరిజనుల జాతి తరపున ప్రత్యేక కతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్, హరీష్, భూక్యా సైదా,బానోత్ తరుణ్, రాజశేఖర్ , రవీందర్, చంప్లా, రాజా, అర్జున్, సిద్ధు పాల్గొన్నారు.