Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతం తగ్గుతుందని అంగన్వాడీ కేంద్రాలకు కరోనా సెలవులు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో మరణించిన అంగన్వాడీ టీచర్లకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంటర్ అద్దెలు 2018 నుండి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. శిక్షణ లేకుండానే స్మార్ట్ ఫోన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పడం సరికాదని, రికార్డులు రాయడం రిజిస్ట్రేషన్లు చేయించడం రెండు చేయలేమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 వేతనం పెంచి అమలు చేయాలని, టీఏడీఏలు ఇవ్వాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పౌష్టికాహారం వండడానికి కావలసిన గ్యాసు ,ఇతర సరుకుల బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఐదు లక్షలు ఆయనకు మూడు లక్షలు రూపాయలు ఇస్తూ వేతనంలో సగం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నల్గొండ ప్రాజెక్టు నాయకులు అర్.మంజుల, కె. విజయలక్ష్మి , ప్రమీల ,బొంత రత్న,రేణుక, ప్రకతాంబ, లక్ష్మీ, మనిరూప,జానమ్మ, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.