Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
అ35 కిలోమీటర్లు ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో వ్యవసాయం పండుగాల మారిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని అనాజిపురం గ్రామం నుండి రెడ్డినాయక్ తండా, పచ్చర్లబోడుతండా, ఆకుతోటబాయితండా, నాగిరెడ్డిపల్లి, గౌస్ నగర్, చందుపట్ల , కునూరు గ్రామం వద్దకు ర్యాలీ నిర్వహిస్తూ సుమారు 35 కిలోమీటర్లు ఎమ్మెల్యే ట్రాక్టర్ నడిపించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నాటికి రైతు బంధు పథకం కింద అన్నదాత ఖాతాలోకి 50 వేల కోట్లు జమ కానున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ పల్లెలు నేడు ఆర్థిక పరిపుష్టి సాధించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున అందించి రైతన్నకు రైతు బాంధవుడయ్యారు. రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉంచడంతో పాటు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. 2,601 రైతు వేదికలు నిర్మించి ఎప్పటికప్పుడు రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు ఇప్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.