Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ద్విచక్ర వాహనాలు (మోటారు సైకిళ్లు )అతివేగంగా ఎదురెదురుగా ఢకొీని ఒకరు మతి చెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గొట్టిపర్తి బాలరాజు (32) ఉదయం గంటలకు తన బైకుపై పశువుల దాన గురించి ఆలేరుకు వచ్చాడు. తిరిగి మాసాయిపేట గ్రామం వెళుతుండగా పట్టణ శివారులో గల మల్లికార్జున రైస్ మిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బైకు బాలరాజును ఢకొీట్టింది. దీంతో బాలరాజు అక్కడిక్కడే మతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు . మతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండీ ఇంద్రేశ్ అలీ తెలిపారు.