Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
భారత రత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో దేశ కరెన్సీ నోట్లపై ముద్రించే వరకు పోరాటం కొనసాగించాలని గాడ్స్ హార్ట్ పర్ నేషన్స్ డైరెక్టర్స్ పిన్నింటి స్టాన్లీ ,పిన్నింటి సరోజనా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల (56వ వారం) సమర్పించిన అనంతరం వారు మాట్లాడారు. భారత రాజ్యంగం గొప్పదని, దానిని రక్షించు కోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్, జిల్లా గౌరవాధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్ చిలుకమారి గణేష్ మాదిగ, రావుల రాజు, మహ్మద్ సలావుద్ధీన్,భానోతు భాస్కర్ నాయక్, డాకూరి ప్రకాష్, కాచరాజ జయ ప్రకాష్, బండారు శివ,దర్గాయి దేవేందర్, బొడ్డు కష్ణ, సిలివేరు రమేష్, ఆలేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.